గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం మైదుకూరు మండలంలోని వనిపెంట గ్రామ సచివాలయం పరిధిలో వున్న ప్రతి ఇంటికి మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి చేకూర్చిన లబ్ధిని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.