చీరాల పట్టణంలో బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో అక్రమంగా ఎలాంటి బిల్లులు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న 5 లారీలను చీరాల పట్టణం వన్ టౌన్ సిఐ మల్లిఖార్జునరావు పట్టుకున్నారు. పట్టణంలో ఆయన నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ లారీలు తారసపడ్డాయి. దీంతో సీఐ ఆ వాహనాలను తనిఖీ చేయగా గ్రావెల్ కనిపించింది. అయితే ఈ గ్రావెల్ రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు లారీ డ్రైవర్ల వద్ద లేవు. దీంతో లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.