బ్రహ్మంగారిమఠం లోని సుందరయ్య భవనంలో గురువారం సమర యాత్ర కరపత్రాన్ని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఎద్దు రాహుల్ మాట్లాడుతూ. ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థి, యువజన సంఘాలు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో జరగనున్న సమరయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకై యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జనవరి 20 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు సమర యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, గిరిజన సెంట్రల్ మైనింగ్ యూనివర్సిటీల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం రైల్వే జోన్ ప్రకటించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని విద్యా , వైద్యసంస్థలను ఏర్పాటు చేయాలని, రాజధాని నిర్మించడానికి నిధులు విడుదల చేయాలని, నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, మండల అధ్యక్ష కార్యదర్శులు కలివెల రాజశేఖర్, ఎర్రంపల్లి అజయ్, మండల సహాయ కార్యదర్శి సందీప్ , కమిటీ సభ్యుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.