శ్రీకాకుళం జిల్లా, పలాస 26 వార్డు గడప గడపకు కార్యక్రమంలో మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం ఎదురైంది. ‘సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారో తెలుసా? పోనీ నేను ఎవరో తెలుసా? అని ఒక మహిళను మంత్రి ప్రశ్నించారు. మహిళ సమాధానం చెప్పకపోవటంతో మంత్రి అసహనానికి లోనయ్యారు. తానెవరో తెలియకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పారు. అయినా ఆ మహిళ నుంచి సమాధానం రాలేదు. స్థానిక మహిళకు తానెవరో తెలియకపోవటంపై మంత్రి అప్పలరాజు అసహనం వ్యక్తం చేశారు.