ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీస చేయనుంది. దీనికోసం విభాగాల వారీగా ఖాళీలు, ఆయా శాఖల్లో రోస్టర్ రిజర్వేషన్లకు తుది రూపు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గతంలో 19 కేటగిరీల ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించగా, ఈసారి ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించనున్నారు.