ఏపీలోని విశాఖపట్నంకి చెందిన ఓ బాలిక (17) పక్క కాలేజీలో ఇంటర్ చదువుతున్న అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇంట్లోని నగలు, డబ్బు తీసుకుని ప్రియుడికి ఇచ్చింది. ఇది తెలిసి ఇంట్లో గొడవలు జరగుతుండగా ఓ రాత్రి నిద్రిస్తున్న తండ్రిపై బాలిక కత్తితో దాడి చేసింది. ఆయన తప్పించుకోవటంతో వీపుకి గాయాలయ్యాయి. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. మరో బాలికతో కూడా ఆ బాలుడు ప్రేమవ్యవహారం నడిపిస్తున్నాడని గుర్తించారు.