ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవత్వం మరించి.... ఖాకీ దర్పం ప్రదర్శించిన మహిళా పోలీసులు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 11:22 AM

మానవత్వం మరిచి ఇద్దరు మహిళీ పోలీసులు యూనిఫాం దర్పం ప్రదర్శించారు. 70 ఏళ్ల ఓ టీచర్‌ను ఇద్దరు మహిళా పోలీసులు నడిరోడ్డుపై లాఠీతో చితకబాదారు. బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు ట్విటర్ ద్వారా షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ పోలీసుల తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆ పెద్దాయన వయసుకైనా వాళ్లు గౌరవం ఇవ్వాల్సిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా కొట్టడానికి ఆయన చేసింది కూడా పెద్ద తప్పు కాదని పేర్కొంటున్నారు. పెద్దాయణ్ని అలా కొడుతుంటే.. ఎవరూ ప్రశ్నించే సాహసం కూడా చేయకపోవడం మరింత ఆశ్చర్యం కలిగించే అంశం.


తనను కొట్టొద్దని ఆ వృద్ధుడు ఎంత వేడుకున్నా వాళ్లు కనికరించలేదు. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆ మహిళా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ను ట్యాగ్ చేస్తూ వీడియోను ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసిన జర్నలిస్ట్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆ ఇద్దరు లేడీ అధికారుల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి పేరు మపాండే జీ. కైమూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చాలా ఏళ్లుగా ఆయన టీచర్‌గా పనిచేస్తున్నాడని జర్నలిస్ట్ తెలిపారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు.


‘ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి అంటే.. సైకిల్‌పై నుంచి కిందపడిపోవడమే. వయసు పైబడిన ఆయన నియంత్రణ కోల్పోయి సైకిల్‌తో పాటు రోడ్డుపై పడిపోయాడు. శక్తి కూడదీసుకొని లేచి నిలబడేందుకు కొంత సమయం పట్టింది. ఆయన చేసిన తప్పు అదే’ అని ఆ జర్నలిస్ట్ తెలిపారు.


‘ఈ పెద్దాయన తప్పు చేసి ఉండొచ్చు గాక.. 70 ఏళ్ల వృద్ధుడిని అలా జంతువులా చితకబాదడం తప్పు కాదా? ఇది ఏవిధమైన చట్టం? ఏ రకమైన సుపరిపాలన?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరంగా.. ఆ మార్గంలో వెళ్తున్న చాలా మంది ప్రజలు వృద్ధుడిని మహిళా పోలీసులు కొడుతుంటూ చూస్తూ వెళ్లిపోయారే తప్ప, ఆపడానికి ఎవరూ జోక్యం చేసుకోలేదు. ఈ ఘటనపై బీహార్ పోలీసులు స్పందించాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com