ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నెల 26వ తేదీ నుంచి ఒంగోలు నగరంలో ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ ఎం.వెంకటే శ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఫ్లెక్సీల యజమానులతో ఆయన స మావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఎం నెం. 65, 75 అను సరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎవ రైనా ప్రభుత్వ ఆదేశాలను అధిగమించి ప్లాస్టిక్ తెర పై ఫ్లెక్సీలు ముద్రిస్తే ఒక చదరపు అడుగుకు రూ. 100 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కాలు ష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు యజమానులు సహకరించాలని కోరారు. ఈ సం దర్భంగా గీతా యాడ్స్ యజమాని బీజీ.రాజా మా ట్లాడుతూ కేరళ రాష్ట్రం తరహాలో ఇక్కడ కూడా ప్లా స్టిక్ ఫ్లెక్సీ రీసైక్లింగ్ సంబంధిత యూనిట్ నెల కొల్పడం ద్వారాప్లాస్టిక్ నియంత్రణ కొంతమేర సా ధ్యపడుతుందని తెలిపారు. వీటి ద్వారా బ్యాగులు, తదితర వస్తువులను తయారు చేయడం వల్ల యు వతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కందుకూరి యాడ్స్ వెంకట్రావు మాట్లాడుతూ గతం నుంచే తాము వస్త్రంపై ఫ్లెక్సీలు ముద్రిస్తున్నా మని, ఈ విధానం వల్ల సాంకేతికపరమైన ఇబ్బం దులు ఎదురవుతున్నాయని, మరికొన్ని రోజులు గడువు ఇప్పించాలని కోరారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, ఏసీసీ కె.వెంకటేశ్వర్లు, ఎంహె చ్‌వో మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.