ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా మహిళలపై వేధింపులు తగ్గడం లేదు. తాజాగా యూపీలో ఓ ప్రయాణికురాలిపై రైల్వే ఉద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు. బాధిత మహిళ రైళ్లో ప్రయాణిస్తుండగా సదరు ఉద్యోగి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని మొరాదాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.