ట్విట్టర్ ను ఆర్థిక నష్టాల నుండి గట్టెక్కించేందుకు ఎలాన్ మస్క్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉద్యోగుల తొలగింపు, ట్విట్టర్ బ్లూ వంటి మార్పులను తీసుకొచ్చారు. తాజాగా వాణిజ్య ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్ ను తీసుకొచ్చే యోచనలో ఉన్నాడు. ట్విట్టర్ లో చాలా పెద్ద ప్రకటనలు తరచుగా కనిపిస్తాయని మస్క్ అన్నాడు. కొంచెం ఎక్కువ ధరలో ప్రకటనలు లేకుండా ప్రత్యేక సబ్ స్క్రిప్షన్ తెస్తామని తెలిపాడు.