చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలతో కూడిన ఆహారం రోజువారిగా తీసుకోవాలి. ముఖ్యంగా చర్మ రక్షణకు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి-8, పాంతోతేనిక్ యాసిడ్, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి పలు పోషకాలు అవసరం. టమాటా, క్యారెట్, యాపిల్,పెరుగు చర్మాన్ని రక్షిస్తాయి. దానిమ్మ, స్ట్రాబెర్రీ, బొప్పాయి, బాదం, ఆకుకూరలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి చర్మ ఆరోగ్యానికి సహకరిస్తాయి.