దావోస్ లో ఏటా భారత ఖ్యాతి పెరుగుతోందని అమరరాజా గ్రూప్స్ చైర్మన్ గల్లాజయదేవ్ వెల్లడించారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నిర్వహించారు. దీనికి హాజరైన గల్లా జయదేవ్ అక్కడ పలు రౌండ్‌టేబుల్స్, ప్యానెల్ డిస్కషన్స్, లీడర్స్ టాక్, పాలసీ మీటింగ్స్‌లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ నుంచి వేగంగా పురోగతి సాధించడం వల్ల అంతర్జాతీయంగా పెట్టుబడుల పటంలో భారత్‌కు స్థానం లభించిందన్నారు. విద్యుత్ వాహనాల కోసం లిథియం అయాన్ బ్యాటరీల తయారీ సంస్థను(గిగా ఫ్యాక్టరీ) స్థాపించామని, దాదాపు 16వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామన్నారు.