విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సోమవారం 31వార్డ్ లో 1086213 డ్వాక్రా బజార్ సచివాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. జీవీఎంసీ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వార్డ్ లో పర్యటించారు. ఎమ్మెల్యే ఇంటింటా తిరుగుతూ గత 3సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి కల్గిన లబ్ధిని తెలియజేస్తూ లబ్ధి పత్రాలను ఆయా కుటుంబాలకు అందజేశారు. ప్రభుత్వ పాలన ఎలా ఉంది తల్లీ. అని మహిళలను అడిగారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. అర్హత ఉంటే చాలు వలంటీర్లు ఒకటికి రెండుసార్లు ఇంటివద్దకు వచ్చి దరఖాస్తు చేయిస్తున్నారన్నారు. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయన్నారు. ఎవరికీ రూపాయి కూడా లంచంగా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైనా పథకాలు అమలు కావాలంటే ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి వార్డ్స్లలో చెబుతున్నారన్నారు. మన అందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కనీవిని ఎరుగని రీతిలో దేశంలో ఎక్కడా లేని విదంగా 31లక్షల మందికి జగనన్న ఇళ్ల స్థలాలు కేటాయించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. పేదప్రజల అభ్యున్నతే సిఎం జగన్నన్న లక్ష్యమని, ఇప్పటికే 98 శాతం పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనని అన్నారు.