మహారాష్ట్రలో 451 మంది ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా సమయంలో ఏడేళ్లు లేదా అంతకంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఖైదీలను జైలు నుంచి విడుదల చేశారు. ఇదే అదునుగా భావించిన ఖైదీలు పరారయ్యారు. పెరోల్ గడువు ముగిసినా చాలా మంది ఖైదీలు తిరిగి జైలుకు రాలేదు. ఈ క్రమంలో 451 మంది అదృశ్యమవ్వగా, 357 మంది ఖైదీలపై FIR నమోదు చేసి, ఖైదీల ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు.