మహారాష్ట్ర కొల్హాపుర్కు చెందిన యువరాజ్ షేలే చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి ఒంటరిగానే జీవిస్తోంది. నాటి నుంచి ఆమే పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. తన తండ్రి మరణంచిన నాటి నుంచి ఇంట్లోనే తల్లి అనుభవిస్తున్న ఒంటరితనాన్ని చూసి తో ఆమెకు ఓ తోడును ఇవ్వాలనుకునుకున్నాడు షేలే. సరైన వ్యక్తిని వెతికి 41 ఏళ్ల తల్లిని ఒప్పించి ఆమెకు పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకున్నాడు.