పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం స్పందన నిర్వహించారు. విశాఖ నగర పోలీసు కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆదేశాలతో ప్రతి సోమవారం స్పందన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నాటి స్పందనకు 39 ఫిర్యాదులు వచ్చినట్టు సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి, సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలని సీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు.