విశాఖ వేదికగా ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఈనెల 28వ తేదీన పెందుర్తి లో గల శారదయ పీఠానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు రానున్నారు. ఈ మేరకు ఇక్కడ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారు మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 28వ తేదీన రాజశ్యామల యాగంలో ఇద్దరు సీఎంలు పాల్గొంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇద్దరినీ స్వయంగా శారద పీఠం స్వామీజీలు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇద్దరు సీఎంలు ఒకే వేదికపై ఇలా కలవడం ప్రాథమిక సంతరిం చుకోనుంది. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.