జనసేన నేత , 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కు ఫోర్త్ టౌన్ పోలీసులు బెయిల్ మంజూరు చేశారు. 22వ వార్డులో అభివృద్ధిని అధికార పక్షం నేతలు అడ్డుకుంటున్నారని, అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని కార్పొరేటర్ మూర్తి యాదవ్ సోమవారం జీవీఎంసీ కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. విధులకు ఆటంకం కల్పిస్తున్నారు అంటూ జీవీఎంసీ అధికారులు ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మూర్తి యాదవ్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎట్టకేలకు సొంత పూచికతపై ఆయనకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేశారు.