జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఖరీఫ్ సిజన్ లో అత్యధిక వరి పంట పండిందని అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలలో నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతులకు పండుగ కానుకగా ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారం సేకరించిన ధాన్యానికి సుమారు 20 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానిదని తెలిపారు.
ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని ఇవ్వాలనుకుంటే అది కూడా సేకరిస్తాం అని తెలుపుతూ రైతులెవ్వరు ఆందోళన చెందకండి. మధ్యవర్తుల చేతులలోకి వెళ్లకండి అని సూచించారు. ఈ సమావేశంలో పలాస వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కె. వి సూర్యనారాయణ రాజు (పులి రాజు) , జడ్పీటీసీ శీర అప్పలనాయుడు , పశుగణాభివృద్ధి చైర్మన్ బెల్లాన బంగారు నాయుడు, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు పాల్గొన్నారు.