ఆవేశం ఎప్పటికీ మంచిది కాదంటారు. అని ఓ జంట విషయంలో నిజమైంది. భార్యభర్తలన్నాక ఇద్దరి మధ్య గొడవలు సర్వసాధారణం. అయితే.. ఈ గొడవల్లో ఎవరో ఒకరు సర్ధుకుపోతే సమస్యే ఉండదు. కానీ.. ఇద్దరూ కోపంతో మాటామాటా అనుకుంటూ పోతే.. అది కాస్తా పెరిగిపెద్దదవుతుంది. ఈ క్రమంలో కోపావేశంలో రకరకాల పరిణామాలు చోటుచేసుకుంది. ఇక్కడ కూడా ఓ జంట మధ్య వచ్చిన గొడవలో ఓ భార్య చేసిన పని చూస్తే అవాక్కవటం ఖాయం. పుట్టింటికి వెళ్లిన తన భార్యను తమ ఇంటికి రావాలని అడిగినందుకు భర్తతో గొడవపడింది ఓ వివాహిత. అయితే... ఈ గొడవలో ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో.. తీవ్రం కోపోద్రిక్తురాలైన ఆ భార్య.. ఏకంగా తన భర్త నాలుకనే కొరికిపారేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఠాకూర్ గంజ్ ప్రాంతంలో వింత ఘటన జరిగింది.
సల్మా అనే వివాహిత తన పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్లింది. గత కొంతకాలంగా అక్కడే ఉంటుంది. కాగా.. భార్యను పిల్లల్ని వాళ్లింటికి తీసుకెళ్లేందుకు భర్త మున్నా.. అత్తగారింటికి వచ్చాడు. కానీ.. భర్తతో వెళ్లేందుకు సల్మా నిరాకరించింది. ఈ క్రమంలోనే దంపతుల మధ్య మాటామాటా పెరిగి గొడవ తయారైంది. ఇద్దరు బాగా తిట్టుకున్నారు. కోపంతో ఉన్న భర్త.. తన భార్యపై ఉమ్మేసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన భార్య.. వెంటనే తన భర్తను పట్టుకొని అతడి నాలుకను గట్టిగా కొరికేసింది. దీంతో నాలుక తెగి నేలపై పడింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో.. అందరూ షాక్‌కు గురయ్యారు. నాలుక తెగిపోవటంతో మున్నాకు తీవ్ర రక్తస్రావమైంది. దీంతో.. మున్నా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబసభ్యులు మున్నాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రస్తుతం మున్నా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కాగా.. భార్య సల్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. భర్యాభర్తల మధ్య చాలా రోజులుగా గొడవ నడుస్తోందని కుటుంబసభ్యులు చెప్తున్నారు.