ఏపీలోని చిన్న తరహా వ్యాపారస్తులకు (చేతి వృత్తుల వారు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులైన దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఖాతాల్లో సోమవారం నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద ఒక్కొక్కరి అకౌంట్లో ప్రభుత్వం రూ. 10,000 చొప్పున జమ చేయనుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30వ తేదీన (సోమవారం) పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల మధ్య వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి 1.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.