పల్నాడు జిల్లా వినుకొండలో 'జగనన్న చేదోడు' పథకం 3వ విడతను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ 43 నెలల కాలంలో పలు పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా రూ.1.92 లక్షల కోట్లు జమ చేశామని తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.3 లక్షల కోట్లు అందించామని, ఎలాంటి దళారులు, లంచాలు, వివక్ష లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చామని తెలిపారు.