11.43శాతం గ్రోత్ రేట్ తో ఏపీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని సీఎం జగన్ తెలిపారు. GSDPలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. కొంతమంది గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిందని, ఇప్పుడు వారికి వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని అన్నారు.