రష్యా అధ్యక్షుడు పుతిన్ పై బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రయిన్ ఆక్రమణకు ముందు రోజు పుతిన్ తనకు ఫోన్ చేశాడని, ఉక్రెయిన్ కు మద్ధతుగా నిలిస్తే రాకెట్ దాడికి వెనుకాడనని పుతిన్ హెచ్చరించాడని తెలిపారు. అయితే తాను పుతిన్ వ్యాఖ్యలకు బెదిరిపోలేదని, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి మద్దతివ్వడానికే మొగ్గు చూపానని వెల్లడించారు.