ఆర్థిక సంక్షొభంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ కు మరో దెబ్బ తగిలింది. ఆ దేశంలో తినేందుకు తిండి సైతం దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాక్ కు జల రవాణా స్తంభించిపోయిందని తెలుస్తోంది. పాక్ దిగుమతి చేసుకోవాలనుకున్న 2 వేల లగ్జరీ కార్లతో పాటు నిత్యావసర వస్తువులు సైతం సముద్ర మార్గాన నిలిచిపోయినట్లు సమాచారం.