రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర ధరలకనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని, మహిళా కార్మికులపై భారం వేయడం తగదని తక్షణమే మెస్ చార్జీలు, వేతనాలు పెంచని పక్షంలో చలో విజయవాడకి పిలుపునిస్తామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం కడప కలెక్టర్ కార్యాలయం ముందర మెస్ చార్జీలు పెంచాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చాంద్ బాషా, అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిధులుగా ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ బాబు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి లు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకాన్ని పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మార్చారని ఏద్దేవా చేశారు. విద్యార్థుల మెస్ రీచార్జీలు పెంచకుండా మౌలిక వసతులు కల్పించకుండా మెను అమలు చేయడం సాధ్యం కాదన్నారు. పెరిగిన నిత్యవసర ధరల వల్ల ఈ పథకాన్ని మహిళలు అమలు చేయలేకపోతున్నారని అధిక వడ్డీలకు అప్పులు చేసి అవమానాల పాలవుతున్నారని అన్నారు.