తదుపరి మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు ఇప్పటికీ సిద్ధంగా లేవని రెడ్‌క్రాస్ హెచ్చరించింది. భవిష్యత్తులో ఏకకాలంలో ఆరోగ్య సంక్షోభాలు, వాతావరణ విపత్తులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ దేశాలు 2025 నాటికి దేశీయ ఆరోగ్య రంగానికి కేటాయింపులను స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతానికి పెంచాలని సూచించింది. వివిధ రకాల విపత్తులను ఏకకాలంలో ఎదుర్కొనేందుకు దేశాలు సంసిద్ధంగా ఉండాలని IRFC తెలిపింది.