మున్సిపల్ కార్మికులకు నాలుగు పూటలా అటెండెన్స, ఏపీఎ్‌ఫఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఇందుకు నిరసనగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన (ఏఐటీయూసీ) రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, గౌరవాధ్యక్షుడు కేసీ బాదుల్లా మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నైజ్డ్ సిస్టంను మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, కార్మికులను పని దొంగలుగా చూపుతూ.. వారి సమస్యలపై వారు పోరాటం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసేందుకు ఏపీఎ్‌ఫఆర్‌ఎస్ తీసుకురావడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బరాయుడు, మద్దిలేటి, మున్సిపల్ వర్కర్స్ యూనియన నాయకులు నరసింహులు, వెంకటాద్రి, ఈశ్వరయ్య, తారకరామారావు, మహిళా నాయకురాలు నిర్మల పాల్గొన్నారు.