కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2023-24లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన అనంతరం నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. అనంతరం పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.