కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడ్తున్నారు. దీనిలో భాగంగా గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కర్ణాటకలోని కరువుపీడిత ప్రాంతాల కోసం రూ.5000 కోట్లు కేటాయించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం రూ.79 వేల కోట్లు కేటాయించారు. ప్రైవేటు, ప్రభుత్వ పరిశోధనల కోసం ICMR ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.