న్యూఢిల్లీ – అమృత్ కాల్ లో ఇది తొలి బడ్జెట్ అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ లా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు..లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను నేడు ఆమె ప్రవేశపెట్టారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతు, పేద, మధ్యతరగతి వారి కోసం బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కేటాయింపులలో రైతులకు, రైల్వే లకు, ఎస్సీలకు, గృహ కొనుగోలు దారులకు పెద్ద పీట వేశారు.
రైతులకు తీపికబురు
రైతులకు రూ.20లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు
కొత్తగా ఇల్లు కొనుగోలు, కట్టుకోవాలనుకోవాలనుకునే వారికి కేంద్రం గుడ్‌న్యూస్
పీఎం ఆవాస్ యోజన పథకానికి గత బడ్జెట్‌లో 48 వేల కోట్ల రూపాయలు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79వేల కోట్లు కేటాయించారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం.
కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు
మత్యశాఖకు రూ. 6 వేల కోట్లు
క్లీన్ ప్లాంట్ కార్యక్రమానికి రూ, 2 వేల కోట్లు
ఎస్సీ వర్గాలకు రూ. 15 వేల కోట్లు
పీఎం ఆవాస్ యోజన్ పథకానికి రూ.79 వేల కోట్లు
గిరిజనుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు
రైల్వేలకు రూ.2.40 లక్షల కోట్లు .. 2013,14 తో పోలిస్తే రైల్వేలకు 9 రెట్ల నిధులు.. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం కోసం 13.7 లక్షల కోట్లు కేటాయింపు
వ్యవసాయ రుణాలకు రూ.20 లక్షల కోట్లు
మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు
ఏకలవ్య పాఠశాలల్లో భారీ ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు