నేడు కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ను 1947 నవంబర్ 26న ఆర్థిక శాఖ మంత్రి షణ్ముకం చెట్టి ప్రవేశపెట్టారు. ఆదాయ అంచనా రూ.171.15 కోట్లు కాగా, వ్యయం రూ.197.39 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీనిలో రక్షణ రంగానికి అత్యధికంగా రూ.92.74 కోట్లు కేటాయించారు. 1947 ఆగస్టు 15 నుండి 1948 మార్చి 31 వరకు ఈ బడ్జెట్ అమలు చేశారు.