నిరుద్యోగులకు బడ్జెట్ లో కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. రానున్న మూడేళ్లలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 38,800 టీచర్ ఉద్యోగాలు, సిబ్బందిని భర్తీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 740 ఏకలవ్య స్కూళ్లలో 3.5 లక్షల మంది చదువుతున్నారని, వారికి సౌకర్యాలు మరింతగా పెంచుతామన్నారు. అదనంగా మరో 157 నర్సింగ్ కాలేజీలు, మరిన్ని మెడికల్ కళాశాలలకు అనుమతిస్తామని ప్రకటించారు.