‘తన బాబాయి హత్యను చంద్రబాబుపై నెట్టాలని జగన్‌రెడ్డి తన పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాయించారు. సీబీఐ దర్యాప్తు ముందుకు వెళ్తున్న కొద్దీ అది జగనాసుర రక్త చరిత్రగా మారుతోంది. సీబీఐ నోటీసులు ఇప్పుడు ఏకంగా తాడేపల్లి ప్యాలెస్‌కే రావడం దీనికి నిదర్శనం’ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. ‘అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి అనేకసార్లు కాల్స్ వెళ్లిన నవీన్‌ను విచారించడానికి సీబీఐ నోటీసు జారీ కాగానే ముఖ్యమంత్రి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా కంగారుపడుతున్నారు. అన్ని కార్యక్రమాలూ రద్దు చేసుకొని ఆయన ఢిల్లీ వెళ్లడం.. సీబీఐ ఉచ్చు నుంచి కాపాడుకోవడానికే’నని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో తనను... తన భార్యను కాపాడుకోవడానికి జగన్ రెడ్డి భయంతో ఢిల్లీ పరుగులుపెట్టారని, ఆ కేసు తమ మెడకు చుట్టుకోకుండా చూసుకోవడమే ఆయనకు ఇప్పుడు అతి ముఖ్యమైన పనిగా మారిందని విమర్శించారు.