ప్రముఖ దర్శకుడు కే.విశ్వనాథ్ నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు. 'శ్రీ కె. విశ్వనాథ్ గారు మృతి చెందడం బాధాకరం. అతను ఒక సృజనాత్మక మరియు బహుముఖ దర్శకుడిగా సినీ ప్రపంచంలోని ప్రముఖుడు. ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి' అని ట్వీట్ చేశారు.