చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామానికి చెందిన మిద్దె చంద్రరావు, రౌతు స్వాములు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. నిరుపేద కుటుంబానికి చెందినవారు, టిడిపి పార్టీకి విధేయులు కావడంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని స్థానిక శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ కు గ్రామస్తులు తెలియజేశారు. ఆయన సొంత నిధులతో ఒక్కో కుటుంబానికి 10, 000 చొప్పున 20, 000 ఆర్థిక సహాయం గ్రామస్తులకు ఇచ్చారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇచ్చిన ఆర్థిక సహాయం ను మాజీ సర్పంచ్ వీరంకి సాంబశివరావు చేతుల మీదగా వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వీరంకి వెంకట శివ, ఉప సర్పంచ్ పోగోలు కోటేశ్వరరావు, రాయన రమేష్ బాబు, కేసన సత్యనారాయణ , మిద్దె మురళి, మిద్దె శ్రీనివాసరావు, గౌడ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.