పుదుచ్చేరిలో ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్, సైకిళ్లు, ల్యాప్ టాప్లు అందజేయకపోవడాన్ని నిరసిస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు స్కూల్ యూనిఫాం ధరించి సైకిళ్లపై అసెంబ్లీకి వెళ్లారు. ఎమ్మెల్యేలు స్కూల్ బ్యాగులు వేసుకుని, గుర్తింపుకార్డులు ధరించి వెళ్లడంతో అందరూ ఆసక్తిగా చూశారు.