బాల్య వివాహాలపై అసోం ప్రభుత్వం ఇవాళ్టి నుంచి కఠిన చర్యలు తీసుకుంటుంది. బాల్య వివాహాలు చేసుకుంటున్న వారిని అరెస్టు చేయడంతో పాటు విస్తృతమైన అవగాహన ప్రచారాన్ని చేపట్టనున్నట్లు CM హిమంత బిస్వా శర్మ తెలిపారు. కాగా బాల్య వివాహాలపై పోలీసులు 15 రోజుల్లో 4,004 కేసులు నమోదు చేశారు. 14 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలను వివాహం చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారు.