జీవిఎంసి 24 వార్డు నక్కవానిపాలెం ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు 24వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి తో కలిసి శుక్రవారం పర్యటించారు.
ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ-ప్రజల సమస్యలు తెలుసుకుంటూన్నారు.
ఈ సందర్భంగా కె. కె రాజు మాట్లాడుతూ గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అందించి వారి ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో ఏ పథకం కావాలన్నా ప్రభుత్వ కార్యాలయం చుట్టూ, ప్రజాప్రతినిధులు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటినుండి ప్రభుత్వ అధికారులు ప్రజల ముంగటికే వచ్చి సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ జీ. వీ. రమణి, రాయుడు శ్రీను, నూకరాజు, 24 వార్డు నాయకులు అశోక్ రెడ్డి, దళి గురుమూర్తి రెడ్డి, సీతకుమారి, గోవింద్, శేఖర్, రఘునాద రెడ్డి, తాతాజీ, పిల్లి చంద్రమోహన్ రెడ్డి, దిలీప్, ప్రకాష్ రెడ్డి, నక్క శేఖర్, చలపతి రెడ్డి, సీనియర్ నాయకులు కిరణ్ రాజు, భోగవల్లి గోవింద్, షేక్ బాబ్జి, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.