లింగసముద్రం మండలంలోని ముత్యాలపాడు పంచాయతీలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు వేముల గోపాల్ రావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ముత్యాలపాడు, ముత్తంవారిపాలెం గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గోపాలరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ప్రజలంతా అర్థం చేసుకోవాలని, ఒక్క ఛాన్స్ అని నమ్మించి, జగన్మోహన్ రెడ్డి ప్రజలను పీడించుకు తింటున్నారని అన్నారు. వైసిపి పరిపాలనలో అన్ని రేట్లు పెరిగిపోయాయని, ఇసుకను దోచుకుంటున్నారని విమర్శించారు.