బద్వేల్ నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో ఎస్టీయూ భవనం నందు సిపిఐ బద్వేల్ ఏరియా జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ మరియు బషీరునిసా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాల్లో భాగమైనటువంటి జగనన్న కాలనీలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరిగినది. ఈ కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారులు నిజంగా వారి సొంత ఇంటి కలలు కలలుగానే మిగిలిపోయాయి తప్ప సొంత ఇంటి కల నెరవేరులేదని వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను పార్టీ నాయకత్వం పరిశీలించగా నిజంగా జగనన్న కాలనీలో ఊరికి ఐదు నుండి ఎనిమిది కిలోమీటర్లు ఉన్నాయని, ఈ కాలనీలు కొండతిప్పల పైన గుట్టల పైన ఉన్నాయే తప్ప ఊరి మధ్యలో కానీ ఊరి సమీపంలో కానీ లేవని అన్నారు. ఒక్కొక్క లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి జకరయ్య, ఏరియా సహాయ కార్యదర్శిలు, పిడుగు మస్తాన్, చంద్రమోహన్ రాజు, కార్యవర్గ సభ్యులు బాల ఓబయ్య, సుబ్బారెడ్డి, కేశవ, పివి రమణ, ఫిరోజ్, ఇమ్మానియేలు, జి ఎల్ నరసింహ, సంజీవ్, జకొబ్, పెంచలయ్య, విజయమ్మ, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.