మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి రెండు రాష్ట్రాలలో సంచలనం లేపిన సంఘటన రోజుకో మలుపు తిరుగుతున్నది. గత నెల 28వ తేదీన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాదు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సీబీఐ అధికారులు శుక్రవారం కడప సెంట్రల్ జైలుకు చేరుకొని సీఎంఓ కార్యాలయంలో ఓఎస్డిగా పనిచేస్తున్న కృష్ణమోహన్, అలాగే వైఎస్ భారతిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న నవీన్ ను కడప సెంట్రల్ జైలులో సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసు కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ అనంతరం రాష్ట్ర సీఎం ఓ కార్యాలయం వరకు వెళ్లింది అంటే ఈ కేసు ఎంత దూరం వెళుతుందో అని కడప జిల్లాలో ఉత్కంఠత నెలకొంది. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.