కడప నగరంలో దిశా పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు ప్రక్కన బుట్టలలో జామ, బొప్పాయి, సపోట పండ్లను పెట్టుకుని అమ్మకాలు జరుపుకొని కుటుంబాలు పోషించుకుంటూ వస్తున్న చిరు వ్యాపారస్తులను ట్రాఫిక్ పోలీసులు నిబంధనల పేరుతో అమ్మకాలు నిలుపుదల చేయడం బాధాకరంగా ఉందని శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జి వేణుగోపాల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కే. సి. బాదుల్లా మాట్లాడుతూ 10 సంవత్సరాల పైబడి అక్కడే చిరువ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారని తెలిపారు.
సాక్షాత్తు సుప్రీంకోర్టు 2014లో చట్టాన్ని తీసుకొచ్చి చిరు వ్యాపారస్తులకు జనావాసాల మధ్య వ్యాపారాలు నిర్వహించుకుందనేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ట్రాఫిక్ సిఐ నిబంధనల పేరుతో కాళీ చేయాలని సూచించగా నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యామ్నాయం చూపించే వరకు వ్యాపారాలు చేసుకోవాలని సూచించిన ట్రాఫిక్ సిఐ మాత్రం ఒప్పుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు పి చంద్రశేఖర్, నగర అధ్యక్షులు పి. సుబ్బరాయుడు, ఇన్సాబ్ నగర కార్యదర్శి ఎస్. మైనుద్దీన్ బాధితులు పాల్గొన్నారు.