కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేశారని, కేంద్ర బడ్జెట్ ప్రతులను రాయచోటి పట్టణంలోని మాసాపేట ప్రాంతంలో శుక్రవారం పి. డి. యస్. యు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి అంకన్న, పిడియస్ యు జిల్లా కోశాధికారి జోకిశ్వర్ మాట్లాడుతూ. తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని ఆనాటి నుండి ఈనాటి వరకు విభజన హామీలు నెరవేర్చలేదని, ప్రత్యేక హోదాకు మొండి చూపిందని, బిజెపి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి గత తొమ్మిదేళ్లలో ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేశారని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి 10 శాతం కేటాయించాల్సి ఉండగా కేవలం 2. 5 శాతం మాత్రమే అరకొర నిధులు కేటాయింపులు చేశారని, కడప ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన నిధులను రాబట్టడంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఘోరంగా విఫలమయ్యారన్నారు. కడప బెంగళూరు రైల్వే లైన్ ప్రస్తుతం పెండ్లిమరి వరకు పూర్తవుందని గురువారం నాడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్ట్ కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ కోరడం అభినందనీయమని కానీ పాత పద్ధతి లాగానే పెండ్లిమర్రి, ఇడుపులపాయి, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, వాల్మీకిపురం మదనపల్లె మీదగానే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు, వ్యవసాయ రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమరంగం పూర్తిగా బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయించడం దారుణమైన విషయమన్నారు.