వేసవి వేడిగాలులు కారణంగా దక్షిణ మధ్య చిలీలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలకు స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే శాంటా జువానా పరిసర ప్రాంతాల్లో మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందితో సహా 13 మంది మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. మంటలను అదుపుచేసే క్రమంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్, మెకానిక్ మరణించారు.