రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలో జగనన్న కాలనీలలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేయాలని రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వే కోడూరు మండల ఎంపీడీవో కార్యాలయం నందు పరిశ్రమ, గృహ నిర్మాణ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులో కొరముట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ నిర్మాణం జరుగుతున్న ప్రతి చోట అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజు, హౌసింగ్ డిఈఈ కుప్పుస్వామి, డిక్కీ చైర్మన్ శివశంకర్, డిఎల్ డిఓ మూర్తి, పంచాయతీరాజ్ డిఇఈ బాల నరసింహులు, జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్ సుధాకరాజు, ట్రాన్స్ ఏడిఈ బాలాజీ, తాసిల్దారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.