తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ప్రమాదానికి గురికావడం పట్ల వైకాపా యువనేత మెంటాడ స్వరూప్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి ప్రమాదం జరిగిన వెనువెంటనే ఆయన వెంకటేష్ చికిత్స పొందుతున్న మెడికవర్ హాస్పిటల్కు చేరుకుని వైద్యాసేవలపై ఆరా తీశారు. అక్కడున్న మాదారపు కుటుంబ సభ్యులు టీడీపీ శ్రేణులు, నుండి వెంకటేష్ ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. పార్టీలు వేరైనా తమ మధ్య మంచి స్నేహ సంబంధం ఉందన్న స్వరూప్, వెంకటేష్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వెంకటేష్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనతోపాటు, వైసిపి నాయకులు నక్కరామరాజు, సిపాన రామారావు, కనపల తేజ, లక్ష్మణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.