డాల్ఫిన్లతో ఈత కొట్టేందుకు నదిలో దిగిన ఓ 16 ఏళ్ల బాలిక సొరచేప దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని నార్త్ ఫ్రీమాంటిల్లోని స్వాన్ నదిలో ఫ్రెండ్స్‌తో కలిసి విహారానికి వెళ్లింది. ఈ క్రమంలో ఓ చోట డాల్ఫిన్ల గుంపు కనిపించడంతో వాటికి సమీపంలో ఈత కొట్టేందుకు ఆమె నదిలోకి దూకింది. అంతలోనే ఓ షార్క్ ఆమెపై దాడికి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మరణించింది.