స్మార్ట్ సిటీస్ నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనలను బ్రిటిష్ డిప్యూటీ హై కమీషనర్ గేరత్ విన్న్ ఓవెన్ వారి బృందంకు జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు వివరించారు. మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో న్యూ డిప్యూటీ హై కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారి బృందం కలిసి స్మార్ట్ సిటీస్ పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీస్ పనులలో భాగంగా నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను బ్రిటిష్ హై కమిషనర్కు కమిషనర్ వివరించారు.
నగరంలో పలు స్కూళ్ళు, పార్కులు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు, రోడ్లు, స్మార్ట్ స్ట్రీట్ల అభివృద్ధి తదితర అంశాలను కమిషనర్ వారికి వివరించారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని ఇంకా పలు అభివృద్ధి పనులు చేపట్టవలసి ఉందని కమిషనర్ వారికి వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ మేనేజర్ ఆనంద తదితరులు పాల్గొన్నారు.