ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే బ్రోకలీకి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి ఈ పంట సాగుతో రైతులు భారీగా లాభాలు పొందే ఛాన్స్ ఉంది. ఇసుక నేలలు ఈ పంట పండించడానికి అనువుగా ఉంటాయి. 30 సెంటిమీటర్ల వ్యత్యాసంతో బ్రోకలీ మొక్కలు నాటాలి. 10 నుంచి 12 రోజుల వ్యవధిలో నీరు పెట్టాల్సి ఉంటుంది. తొలి రెండు తడుల తర్వాత కలుపు తీయాలి. పొలాన్ని శుభ్రంగా ఉంచడం ద్వారా దిగుబడి పెంచుకోవచ్చు. భారీ లాభాలు పొందవచ్చు.